ఏపీలో మద్యం షాపుల కొత్త టైమింగ్స్ ఇవే..!
ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపు ప్రశాంతంగా మునిగిసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 14న లాటరీ డ్రా నిర్వహించి మద్యం షాపులను విజేతలకు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలు ఉండగా అందులో 10 శాతం అంటే 345 దుకాణాలను కేవలం మహిళలే దక్కించుకున్నారు. ఈ లాటరీ ప్రక్రియ ఆయా జిల్లాల్లోని కలెక్టర్ల పరిధిలో జరిగాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో అక్టోబర్ 16 నుంచి కొత్త మద్యం పాలసీ అమలులోకి వస్తుంది. కొత్త పాలసీలో భాగంగా మద్యం షాపులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 వరకూ తెరిచి ఉండనున్నాయి. తక్కువ ధరకే మద్యం విక్రయాలు జరుగుతాయని ప్రభుత్వం చెబుతోంది. గత ఐదేళ్లుగా అందుబాటులో లేని డిజిటల్ పేమెంట్స్ సైతం చేయవచ్చు. దాంతో నగదు చెల్లింపు సమస్యకు చెక్ పెట్టింది కూటమి ప్రభుత్వం. నిబంధనలు కచ్చితంగా పాటించాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని మద్యం షాపు నిర్వాహకులను హెచ్చరించారు..