మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

దేశంలో ఇటీవలే హర్యానా, జమ్ము కశ్మీర్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఇప్పుడు మరో రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.. మహారాష్ట్రలో 288, జార్ఖండ్ 81 అసెంబ్లీ స్థానాలున్నాయి. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయని.. ఈసీ ప్రకటించింది.. నవంబర్‌ 20న మహారాష్ట్ర ఎన్నికలు జరగనుండగా.. 23న ఫలితాలు వెల్లడికానున్నాయి.. నవంబర్‌ 26తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనుంది.. దీంతో ఈసీ ఎన్నికల తేదీలను ప్రకటించింది. ఈ నెల 22న మహారాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్.. ఈ నెల 29 వరకు నామినేషన్ల స్వీకరణ.. నామినేషన్ల ఉపసంహరణకు గడువు నవంబర్ 4 గా ప్రకటించింది. అంతేకాకుండా.. జార్ఖండ్‌ ఎన్నికలు రెండు దశల్లో జరుగుతాయని ఎన్నికల సంఘం వెల్లడించింది. జార్ఖండ్ ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 18న వెలువడనుంది. అక్టోబర్ 25 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 28 నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అక్టోబర్ 30వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ఉంది. నవంబర్ 13, 20న జార్ఖండ్‌ ఎన్నికలు, 23న ఫలితాలు వెలువడనున్నాయి.. నవంబర్‌ 13న 43 స్థానాలకు ఎన్నికలు, నవంబర్‌ 20న 38 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!