జాతీయ అంబాసిడర్‌గా రష్మిక మందన్న
భారతదేశంలో సైబర్ నేరాలు నిరంతరం పెరుగుతున్నాయి. ఈ సైబర్ నేరాల వల్ల పెద్దసంఖ్యలో ప్రజలు ఇబ్బంది పడుతున్నాయి. దీంతో సైబర్ భద్రత గురించి అవగాహనను బలోపేతం చేయడానికి, భారతదేశంలో పెరుగుతున్న సైబర్ క్రైమ్‌ల సమస్యను పరిష్కరించడానికి, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C)కు నటి రష్మిక మందన్నను ‘జాతీయ సైబర్ సేఫ్టీ అంబాసిడర్’ గా నియమించింది. ఈ విషయాన్ని రష్మిక సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. తనకు ఇలాంటి గౌరవం, బాధ్యతను అప్పజెప్పిన సెంట్రల్ గవర్నమెంట్ హోంశాఖకు రష్మిక తన ధన్యవాదాలు తెలియజేసింది. ఆన్‌లైన్ మోసం, డీప్‌ఫేక్ వీడియోలు, సైబర్ బెదిరింపు, హానికరమైన AI- రూపొందించిన కంటెంట్‌తో సహా వివిధ సైబర్ బెదిరింపుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి రష్మిక దేశవ్యాప్తంగా కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది.