వయనాడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ
రాహుల్ గాంధీ రాజీనామాతో కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. తాజాగా ఈ స్థానం నుంచి ప్రియాంక గాంధీ బరిలోకి దిగబోతున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం కొద్దిసేపటి క్రితం అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 13న ఎన్నిక జరుగనున్నది. కాగా, గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండుచోట్ల పోటీ చేశారు. కేరళ లోని వయనాడ్, ఉత్తర్ప్రదేశ్ లోని రాయబరేలీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి.. రెండు చోట్లా గెలిచారు.