నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు అమ్మకాల బత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి.

సెన్సెక్స్ ఉదయం 82,101.86 పాయింట్ల (క్రితం ముగింపు 81,973.05) వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 82,300.44 వద్ద గరిష్ఠాన్ని తాకింది. తర్వాత నష్టాల్లోకి జారుకుంది. చివరికి 152.93 పాయింట్లతో 81,820.12 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 70.60 పాయింట్ల నష్టంతో 25,057.35 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.04గా ఉంది.

సెన్సెక్స్ 30 సూచీలో ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభపడగా.. బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, టాటా స్టీల్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో ముగిశాయి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!