ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న పవన్ కల్యాణ్
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా ఏడోరోజు ఇవాళ మూలా నక్షత్రం కావడంతో సరస్వతీదేవీ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. భారీగా తరలివస్తున్న భక్తులతో ఇంద్రకీలాద్రిపై కోలాహలం నెలకొంది.ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు కుమార్తె ఆద్యతో కలిసి కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయం వద్ద పవన్‌కు స్వాగతం పలికిన అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్రపటం అందజేశారు. ఉప ముఖ్యమంత్రితో పాటు హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్ కూడా దుర్గమ్మను దర్శించుకున్నారు.