admin

వయనాడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ

రాహుల్ గాంధీ రాజీనామాతో కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. తాజాగా ఈ స్థానం నుంచి ప్రియాంక గాంధీ బరిలోకి దిగబోతున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం కొద్దిసేపటి క్రితం అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 13న ఎన్నిక జరుగనున్నది. కాగా, గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండుచోట్ల పోటీ చేశారు. కేరళ లోని వయనాడ్, ఉత్తర్​ప్రదేశ్‌ లోని రాయబరేలీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి.. రెండు చోట్లా గెలిచారు.

Read More

తెలంగాణ గ్రూప్‌ 1 మెయిన్స్‌కు లైన్‌ క్లియర్‌

తెలంగాణలో గ్రూప్‌-1 ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు లైన్ క్లియ‌ర్ అయింది. గ్రూప్1 నోటిఫికేష‌న్ల‌ను స‌వాల్ చేస్తూ ప‌లువురు దాఖ‌లు చేసిన పిటిష‌న్ల‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఈ నెల 21 నుంచి గ్రూప్‌-1 మెయిన్స్ ప‌రీక్ష‌లు య‌థావిధిగా జ‌ర‌గ‌నున్నాయి. వీటితోపాటు ప్రిలిమ్స్‌పై దాఖలైన పిటిషన్లను కూడా హైకోర్టు కొట్టేసింది. ప్రిలిమ్స్‌లోని ఏడు ప్ర‌శ్న‌ల‌కు ఫైన‌ల్ ‘కీ’లో స‌రైన స‌మాధానాలు ఇవ్వ‌లేద‌ని పిటిషన‌ర్లు హైకోర్టును ఆశ్ర‌యించిన విష‌యం తెలిసిందే. వాటికి మార్కులు క‌లిపి మ‌ళ్లీ మెయిన్స్‌కు ఎంపిక అభ్య‌ర్థుల‌…

Read More

తెలుగోడి సత్తా..అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తెలుగు పోస్టర్లు

నవంబర్ 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్యక్రమాలు రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ కమలా హారిస్ గా జరగనున్న ఈ అగ్రరాజ్య అధ్యక్ష పీఠ సమరం నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుంది. ఈ సమయంలో ప్రవాస భారతీయ ఓటర్ల మద్దతు కోసం పార్టీలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా డల్లాస్‌లో తెలుగులో ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఫ్లెక్సీ కనిపించడం ఆసక్తిని కలిగిస్తోంది. తెలుగుతోపాటు తమిళం, ఇంగ్లీష్ భాషల్లో…

Read More

నిరుద్యోగులకు శుభవార్త..ఐటీబీపీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

నిరుద్యోగులకు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ITBP) శుభవార్త చెప్పింది. ఐటీబీపీలో కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 545 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. జనరల్ కేటగిరీలో 209 పోస్టులు, ఎస్సీ కేటగిరీలో 77 పోస్టులు. ఎస్టీ కేటగిరీలో 40 పోస్టులు, ఓబీసీ కేటగిరీలో 164 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 55 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ పోస్టులకు ధరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 21 నుంచి 27 ఏళ్ల…

Read More

మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

దేశంలో ఇటీవలే హర్యానా, జమ్ము కశ్మీర్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఇప్పుడు మరో రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.. మహారాష్ట్రలో 288, జార్ఖండ్ 81 అసెంబ్లీ స్థానాలున్నాయి. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయని.. ఈసీ ప్రకటించింది.. నవంబర్‌ 20న మహారాష్ట్ర ఎన్నికలు జరగనుండగా.. 23న ఫలితాలు వెల్లడికానున్నాయి.. నవంబర్‌ 26తో…

Read More

ఒకే ఓవర్‎లో 4, 4, 4, 4, 4, 4..సిరీస్ సమం!

డంబుల్లా వేదికగా విండీస్‎తో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సాంక ఆకట్టుకున్నారు. షామార్ జోసెఫ్ వేసిన నాలుగో ఓవర్లో వరుసగా ఆరు ఫోర్లు బాదారు. తొలి బంతి లెగ్ బై ఫోర్ వెళ్లగా, ఆ తర్వాత 4, WD, 4, 4, 4, 4 కొట్టారు. మొత్తంగా అర్థ సెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162…

Read More
error: Content is protected !!