నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు అమ్మకాల బత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ ఉదయం 82,101.86 పాయింట్ల (క్రితం ముగింపు 81,973.05) వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 82,300.44 వద్ద గరిష్ఠాన్ని తాకింది. తర్వాత నష్టాల్లోకి జారుకుంది. చివరికి 152.93 పాయింట్లతో 81,820.12 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 70.60 పాయింట్ల నష్టంతో 25,057.35 వద్ద స్థిరపడింది….

Read More

వయనాడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ

రాహుల్ గాంధీ రాజీనామాతో కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. తాజాగా ఈ స్థానం నుంచి ప్రియాంక గాంధీ బరిలోకి దిగబోతున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం కొద్దిసేపటి క్రితం అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 13న ఎన్నిక జరుగనున్నది. కాగా, గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండుచోట్ల పోటీ చేశారు. కేరళ లోని వయనాడ్, ఉత్తర్​ప్రదేశ్‌ లోని రాయబరేలీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి.. రెండు చోట్లా గెలిచారు.

Read More

నిరుద్యోగులకు శుభవార్త..ఐటీబీపీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

నిరుద్యోగులకు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ITBP) శుభవార్త చెప్పింది. ఐటీబీపీలో కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 545 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. జనరల్ కేటగిరీలో 209 పోస్టులు, ఎస్సీ కేటగిరీలో 77 పోస్టులు. ఎస్టీ కేటగిరీలో 40 పోస్టులు, ఓబీసీ కేటగిరీలో 164 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 55 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ పోస్టులకు ధరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 21 నుంచి 27 ఏళ్ల…

Read More

మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

దేశంలో ఇటీవలే హర్యానా, జమ్ము కశ్మీర్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఇప్పుడు మరో రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.. మహారాష్ట్రలో 288, జార్ఖండ్ 81 అసెంబ్లీ స్థానాలున్నాయి. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయని.. ఈసీ ప్రకటించింది.. నవంబర్‌ 20న మహారాష్ట్ర ఎన్నికలు జరగనుండగా.. 23న ఫలితాలు వెల్లడికానున్నాయి.. నవంబర్‌ 26తో…

Read More
error: Content is protected !!