నాంపల్లి కోర్టుకు హాజరైన నాగర్జున కుటుంబం

అక్కినేని నాగచైతన్య, నటి సమంత విడాకుల విషయంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు అక్కినేని నాగార్జున కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. అయితే తన పిటిషన్ విషయంలో నాగార్జున మంగళవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. నాగార్జున తో పాటు నాగచైతన్య, అమల, సుప్రియ హాజరయ్యారు. కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావాపై నాగార్జున నేరుగా తన స్టేట్‌మెంట్ ఇవ్వనున్నారు. ఇంతకుముందు ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా. ఫిర్యాదుదారులు ప్రత్యక్షంగా కోర్టుకు రావాలని…

Read More

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు అమ్మకాల బత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ ఉదయం 82,101.86 పాయింట్ల (క్రితం ముగింపు 81,973.05) వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 82,300.44 వద్ద గరిష్ఠాన్ని తాకింది. తర్వాత నష్టాల్లోకి జారుకుంది. చివరికి 152.93 పాయింట్లతో 81,820.12 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 70.60 పాయింట్ల నష్టంతో 25,057.35 వద్ద స్థిరపడింది….

Read More

ఏపీలో మద్యం షాపుల కొత్త టైమింగ్స్ ఇవే..!

ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపు ప్రశాంతంగా మునిగిసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 14న లాటరీ డ్రా నిర్వహించి మద్యం షాపులను విజేతలకు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలు ఉండగా అందులో 10 శాతం అంటే 345 దుకాణాలను కేవలం మహిళలే దక్కించుకున్నారు. ఈ లాటరీ ప్రక్రియ ఆయా జిల్లాల్లోని కలెక్టర్ల పరిధిలో జరిగాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో అక్టోబర్ 16 నుంచి కొత్త మద్యం పాలసీ అమలులోకి వస్తుంది. కొత్త పాలసీలో భాగంగా మద్యం…

Read More

వయనాడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ

రాహుల్ గాంధీ రాజీనామాతో కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. తాజాగా ఈ స్థానం నుంచి ప్రియాంక గాంధీ బరిలోకి దిగబోతున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం కొద్దిసేపటి క్రితం అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 13న ఎన్నిక జరుగనున్నది. కాగా, గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండుచోట్ల పోటీ చేశారు. కేరళ లోని వయనాడ్, ఉత్తర్​ప్రదేశ్‌ లోని రాయబరేలీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి.. రెండు చోట్లా గెలిచారు.

Read More

తెలంగాణ గ్రూప్‌ 1 మెయిన్స్‌కు లైన్‌ క్లియర్‌

తెలంగాణలో గ్రూప్‌-1 ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు లైన్ క్లియ‌ర్ అయింది. గ్రూప్1 నోటిఫికేష‌న్ల‌ను స‌వాల్ చేస్తూ ప‌లువురు దాఖ‌లు చేసిన పిటిష‌న్ల‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఈ నెల 21 నుంచి గ్రూప్‌-1 మెయిన్స్ ప‌రీక్ష‌లు య‌థావిధిగా జ‌ర‌గ‌నున్నాయి. వీటితోపాటు ప్రిలిమ్స్‌పై దాఖలైన పిటిషన్లను కూడా హైకోర్టు కొట్టేసింది. ప్రిలిమ్స్‌లోని ఏడు ప్ర‌శ్న‌ల‌కు ఫైన‌ల్ ‘కీ’లో స‌రైన స‌మాధానాలు ఇవ్వ‌లేద‌ని పిటిషన‌ర్లు హైకోర్టును ఆశ్ర‌యించిన విష‌యం తెలిసిందే. వాటికి మార్కులు క‌లిపి మ‌ళ్లీ మెయిన్స్‌కు ఎంపిక అభ్య‌ర్థుల‌…

Read More

తెలుగోడి సత్తా..అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తెలుగు పోస్టర్లు

నవంబర్ 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్యక్రమాలు రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ కమలా హారిస్ గా జరగనున్న ఈ అగ్రరాజ్య అధ్యక్ష పీఠ సమరం నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుంది. ఈ సమయంలో ప్రవాస భారతీయ ఓటర్ల మద్దతు కోసం పార్టీలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా డల్లాస్‌లో తెలుగులో ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఫ్లెక్సీ కనిపించడం ఆసక్తిని కలిగిస్తోంది. తెలుగుతోపాటు తమిళం, ఇంగ్లీష్ భాషల్లో…

Read More

మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

దేశంలో ఇటీవలే హర్యానా, జమ్ము కశ్మీర్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఇప్పుడు మరో రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.. మహారాష్ట్రలో 288, జార్ఖండ్ 81 అసెంబ్లీ స్థానాలున్నాయి. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయని.. ఈసీ ప్రకటించింది.. నవంబర్‌ 20న మహారాష్ట్ర ఎన్నికలు జరగనుండగా.. 23న ఫలితాలు వెల్లడికానున్నాయి.. నవంబర్‌ 26తో…

Read More
error: Content is protected !!