Chitagupta-Times https://chitraguptatimes.com Content Writing Tue, 15 Oct 2024 16:10:51 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.1 https://chitraguptatimes.com/wp-content/uploads/2024/09/cropped-CGT-32x32.jpg Chitagupta-Times https://chitraguptatimes.com 32 32 నాంపల్లి కోర్టుకు హాజరైన నాగర్జున కుటుంబం https://chitraguptatimes.com/2024/10/08/nagarjunas-family-present-at-nampally-court/ https://chitraguptatimes.com/2024/10/08/nagarjunas-family-present-at-nampally-court/#respond Tue, 08 Oct 2024 05:58:33 +0000 https://demo.blazethemes.com/local-news-pro-six/?p=61

అక్కినేని నాగచైతన్య, నటి సమంత విడాకుల విషయంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు అక్కినేని నాగార్జున కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. అయితే తన పిటిషన్ విషయంలో నాగార్జున మంగళవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. నాగార్జున తో పాటు నాగచైతన్య, అమల, సుప్రియ హాజరయ్యారు. కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావాపై నాగార్జున నేరుగా తన స్టేట్‌మెంట్ ఇవ్వనున్నారు. ఇంతకుముందు ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా. ఫిర్యాదుదారులు ప్రత్యక్షంగా కోర్టుకు రావాలని జడ్జి ఆదేశించడంతో. నాగార్జున న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు.

]]>
https://chitraguptatimes.com/2024/10/08/nagarjunas-family-present-at-nampally-court/feed/ 0 61
నడుం నొప్పి పోవాలంటే ఏం చేయాలి ? https://chitraguptatimes.com/2022/09/08/how-to-get-rid-of-back-pain/ https://chitraguptatimes.com/2022/09/08/how-to-get-rid-of-back-pain/#respond Thu, 08 Sep 2022 06:07:45 +0000 https://demo.blazethemes.com/local-news-pro-six/?p=64 మనలో చాలా మంది నేలపైన కాకుండా బెడ్ పైన పడుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. వీళ్లు అందరూ చెప్పే కారణం ఒక్కటే రోజంతా కష్టపడి మెత్తటి బెడ్ పై పడుకుంటే హాయిగా నిద్రపడుతుందని.. ఇందుకోసం వేలకు వేలు ఖర్చు పెట్టి బెడ్స్ ను కొనుగోలు చేస్తుంటారు. కానీ బెడ్ పై పడుకోవడం కంటే నేలపై పడుకుంటేనే చాలా బెటర్ అని మీకు తెలుసా..? సాధారణంగా భుజం నొప్పి, లేదా ఇతర కండరాల నొప్పులతో బాధపడే వారిని నేలపై పడుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వెన్ను నొప్పితో ఇబ్బంది పడే వారు నేలపై పడుకోవాలంటున్నారు. బెడ్‌పై పడుకోవడం వల్ల నిద్ర భంగిమల్లో మార్పులు జరగుతుంటాయి. అయితే నేల మీద పడుకోవడం వల్ల నిద్ర భంగిమ సరిగ్గా ఉంటుంది. దీంతో వెన్నునొప్పికి చెక్‌ పెట్టొచ్చు.

]]>
https://chitraguptatimes.com/2022/09/08/how-to-get-rid-of-back-pain/feed/ 0 64
ఇంద్రకీలాద్రిపై దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న ప‌వ‌న్ కల్యాణ్‌ https://chitraguptatimes.com/2022/09/08/pawan-kalyan-visiting-durgamma-on-indrakiladri/ https://chitraguptatimes.com/2022/09/08/pawan-kalyan-visiting-durgamma-on-indrakiladri/#respond Thu, 08 Sep 2022 05:48:08 +0000 https://demo.blazethemes.com/local-news-pro-six/?p=58 ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా ఏడోరోజు ఇవాళ మూలా న‌క్ష‌త్రం కావ‌డంతో స‌రస్వ‌తీదేవీ అలంకారంలో అమ్మవారు భక్తులకు ద‌ర్శ‌న‌మిస్తున్నారు. భారీగా తరలివస్తున్న భక్తులతో ఇంద్రకీలాద్రిపై కోలాహలం నెలకొంది.ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ నేడు కుమార్తె ఆద్య‌తో క‌లిసి క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్నారు. ఆలయం వద్ద పవన్‌కు స్వాగతం పలికిన అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. ఆ త‌ర్వాత తీర్థ‌ప్ర‌సాదాలు, అమ్మ‌వారి చిత్రప‌టం అంద‌జేశారు. ఉప ముఖ్య‌మంత్రితో పాటు హోంమంత్రి అనిత‌, ఎంపీ కేశినేని శివ‌నాథ్ కూడా దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్నారు.

]]>
https://chitraguptatimes.com/2022/09/08/pawan-kalyan-visiting-durgamma-on-indrakiladri/feed/ 0 58
నేడు రెండో టీ20..సిరీస్ పై భారత్ కన్ను https://chitraguptatimes.com/2022/09/08/how-to-wear-brown-in-15-easy-and-stylish-ways/ https://chitraguptatimes.com/2022/09/08/how-to-wear-brown-in-15-easy-and-stylish-ways/#respond Thu, 08 Sep 2022 05:30:25 +0000 https://demo.blazethemes.com/local-news-pro-six/?p=55 స్వదేశంలో వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా మరో సిరీస్ విజయంపై కన్నేసింది. బంగ్లాదేశ్ తో మూడు టీ20ల్లో భాగంగా నేడు ఢిల్లీ వేదికగా రెండో టి20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే మొదటి టి20 మ్యాచ్ గెలిచిన టీమ్ ఇండియా జట్టు… రెండవ టి20 మ్యాచ్ లో కూడా విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకోవాలని… ఎంతో ఆత్రుతగా ఉంది. ఇక టీ20 చరిత్రలో బంగ్లాదేశ్ తో ఆడిన 15 మ్యాచ్ లలో భారత్ ఇప్పటివరకు 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. బంగ్లాదేశ్ టీమ్ కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది.

]]>
https://chitraguptatimes.com/2022/09/08/how-to-wear-brown-in-15-easy-and-stylish-ways/feed/ 0 55
మంగళ సూత్రం వెనకున్న శాస్త్రం ఏంటి..? https://chitraguptatimes.com/2022/09/08/what-is-the-science-behind-mangal-sutra/ https://chitraguptatimes.com/2022/09/08/what-is-the-science-behind-mangal-sutra/#respond Thu, 08 Sep 2022 05:27:31 +0000 https://demo.blazethemes.com/local-news-pro-six/?p=49 పెళ్ళైన స్త్రీకి అందం, ఐశ్వర్యం మెడలో తాళి బొట్టు. భర్త భార్యకి కట్టినప్పుడు వేద మంత్రాలతో ఆ తంతు జరుగుతుంది. భార్య మెడలో మంగళసూత్రం, నుదిటిన సింధూరం భర్త ప్రాణాలను సంతోషాలను కాపాడుతుంది. మంగళసూత్రానికి సంబంధించిన విషయాలను ప్రతి భర్త తెలుసుకుని భార్య అలా మంగళసూత్రం వేసుకునేలా చూసుకోవాలి.భార్యాభర్తల మధ్య అనుభందానికి గుర్తే ఈ మంగళసూత్రం.

పూర్వకాలం భారతదేశంలో మాతృస్వామిక వ్యవస్థ ఉన్న సమయంలో ఎటువంటి ఆచారాలు, కట్టుబాట్లు లేకుండా బలవంతుడిదే రాజ్యం అనే విధంగా ఉండేది. అప్పట్లో కొన్ని కిరాతక జాతుల వారు వలస వచ్చారు. ఈ జాతుల వారు మరొక తెగకు చెందిన స్త్రీలను ఎత్తుకుపోయేవారు. అప్పుడు పురుషులు వారితో పోరాటం చేసి స్త్రీలను కాపాడుకునేవారు. కాలం గడిచేకొద్ది తమ స్త్రీలకు తాయత్తు లేదా తాడు వంటి వాటిని కట్టేవారు. ఆ రోజుల్లో మెడలో మంగళసూత్రం కనపడితే ఆ మహిళలను ఏమి చేసేవారు కాదట.

మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా.. కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం ఈ మంత్రం ఉద్దేశం ఏంటో తెలుసా ? పెళ్ళికొడుకునైన నేను పెళ్ళి కూతురివైన నీ మెడలో ఈ మంగళ సూత్రాన్ని నీ కంఠానికి కడుతున్నాను. నీవు దీనిని ధరించి నా జీవితంలో అన్నింట సగభాగమై, నాకు తోడు నీడగా ఉంటు మనమిద్ధరం నిండు నూరేళ్ళు కలిసి ఆనందంగా జీవిద్దాం. అంటే పుణ్యస్త్రీగా ముత్తయిదువు గా జీవించు అని మంత్రం ఉద్దేశం.

మంగళ సూత్రంలో స్త్రీ శారీరక, మానసిక రక్షణ కొరకు ముత్యం, పగడం వాడతారు. మన పూర్వీకుల నుండే మంగళ సూత్రంలో ముత్యం, పగడం ధరించిన పాత తరం స్త్రీలలో వారు సంతానం కనే సమయంలో ఆపరేషన్ లేకుండానే సహజ సిద్ధంగా పిల్లలను కనేవారట. ఆపరేషన్ అనేది అప్పట్లో చాలా అరుదైన విషయం, కాని ప్రస్తుత కాలంలో స్త్రీలలో కానుపు ఆపరేషన్‌తోనే జరగటం సర్వసాధారణమైపోయింది.

విషయానికి వస్తే.. ముత్యం, పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలో నుండే ఎరుపు (కుజుడు) తెలుపు (చంద్రుడు) స్వీకరించి స్త్రీ శరీర భాగంలోని అన్ని నాడీ కేంద్రములను ఉత్తేజపరచి శారీరకంగా, భౌతికంగా ఆ జంట గ్రహాల వల్ల ఆరోగ్య పరంగా స్త్రీలలో వచ్చే నష్టాలను, దోషాలను తొలగిస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు. కనుక చంద్ర, కుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో అలాగే ముత్యం, పగడం కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంత శుభఫలితాలు అందిస్తాయి.

స్త్రీలకు కుజ గ్రహ ప్రభావం వల్ల అతికోపం, కలహాలు, మొండితనం, సామర్ధ్యము, రోగము, ఋణపీడలు, అగ్ని, విద్యుత్ భయములు, పరదూషణ, కామవాంఛలు, దీర్ఘసౌమాంగల్యము, దృష్టి దోషము యిత్యాదులు, శారీరకంగా ఉదరము, రక్తస్రావం, గర్భస్రావం, ఋతుదోషములు మొదలగునవి ఏర్పడతాయి. ప్రస్తుత కాలంలో మనదేశ స్త్రీలు ఎక్కువ శాతం ఎందుకు పనికిరాని ఉపయోగంలేని విదేశీ సాంప్రదాయ మోజులో పడి సనాతనమైన, ప్రయోజనకరమైన మనదేశ సాంప్రాదాయ ధర్మాన్ని మరచి అనారోగ్య బారిన పడుతున్నారు. డెలివరీలకు సర్వసాధారణంగా సీజేరియన్ లేనిదే పిల్లలను కనటం లేదని మనకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.

శాస్త్రీయ సాంప్రదాయ పరంగా ఆరోగ్య పరంగా, జ్యోతిష పరంగా మంగళసూత్రాలు, మెట్టెలు, బొట్టు, గాజులు అనేవి స్త్రీని అన్ని విధాలుగా కాపాడుతూ, చక్కటి దేహాకాంతితో ఆరోగ్యకరమైన సంసార జీవనాన్ని కొనసాగించేలా చేస్తాయి. ఇవి లేకుండా ఉండటం ఎంత మాత్రం ఆరోగ్యదాయకం కాదు, ఏ విధంగా చూసినా మంచిది కాదు. విలువలు తెలియని వివాహాలు విడాకుల వరకు తీసుకువెలుతాయి, సాంప్రదాయ సంస్కారంలేని కుటుంబంలో కలతలు చోటు చేసుకుంటాయి.

]]>
https://chitraguptatimes.com/2022/09/08/what-is-the-science-behind-mangal-sutra/feed/ 0 49
వందేభారత్ రైలుకు బాంబు బెదిరింపు https://chitraguptatimes.com/2022/09/07/bomb-threat-to-vande-bharat-train/ https://chitraguptatimes.com/2022/09/07/bomb-threat-to-vande-bharat-train/#respond Wed, 07 Sep 2022 12:26:20 +0000 https://demo.blazethemes.com/local-news-pro-six/?p=43 ఇటివల కాలంలో దేశంలో బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. అనేక ప్రాంతాల్లో స్కూల్స్, మాల్స్, ఆస్పత్రులు, విమానాల్లో బాంబులు ఉన్నాయని బెదిరింపులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి బయలుదేరే వందేభారత్‌ రైల్లో బాంబు పెట్టానని ఓ అజ్ఞాతవ్యక్తి పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌చేసి బెదిరించాడు. దీంతో పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ పోలీసులు గోపాలపురం పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన గోపాలపురం పోలీసులు ప్రత్యేక బృందంతో కలిసి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వెళ్లి తనిఖీలు చేశారు. అయితే, ఆ సమయంలో వందేభారత్‌ రైలు లేకున్నా, రైల్వేస్టేషన్‌ లో ముందస్తుగా తనిఖీలు చేపట్టారు.

]]>
https://chitraguptatimes.com/2022/09/07/bomb-threat-to-vande-bharat-train/feed/ 0 43
జాతీయ అంబాసిడర్‌గా రష్మిక మందన్న https://chitraguptatimes.com/2022/09/07/how-science-failed-to-unlock-the-mysteries-of-the-human-brain/ https://chitraguptatimes.com/2022/09/07/how-science-failed-to-unlock-the-mysteries-of-the-human-brain/#respond Wed, 07 Sep 2022 12:20:40 +0000 https://demo.blazethemes.com/local-news-pro-six/?p=40 భారతదేశంలో సైబర్ నేరాలు నిరంతరం పెరుగుతున్నాయి. ఈ సైబర్ నేరాల వల్ల పెద్దసంఖ్యలో ప్రజలు ఇబ్బంది పడుతున్నాయి. దీంతో సైబర్ భద్రత గురించి అవగాహనను బలోపేతం చేయడానికి, భారతదేశంలో పెరుగుతున్న సైబర్ క్రైమ్‌ల సమస్యను పరిష్కరించడానికి, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C)కు నటి రష్మిక మందన్నను ‘జాతీయ సైబర్ సేఫ్టీ అంబాసిడర్’ గా నియమించింది. ఈ విషయాన్ని రష్మిక సోషల్‌ మీడియా ద్వారా తెలుపుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. తనకు ఇలాంటి గౌరవం, బాధ్యతను అప్పజెప్పిన సెంట్రల్‌ గవర్నమెంట్‌ హోంశాఖకు రష్మిక తన ధన్యవాదాలు తెలియజేసింది. ఆన్‌లైన్ మోసం, డీప్‌ఫేక్ వీడియోలు, సైబర్ బెదిరింపు, హానికరమైన AI- రూపొందించిన కంటెంట్‌తో సహా వివిధ సైబర్ బెదిరింపుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి రష్మిక దేశవ్యాప్తంగా కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది.

]]>
https://chitraguptatimes.com/2022/09/07/how-science-failed-to-unlock-the-mysteries-of-the-human-brain/feed/ 0 40
ఘోరం… గోనె సంచిలో బాలిక మృతదేహం https://chitraguptatimes.com/2022/09/07/ae-shipping-on-a-roll-once-again-with-soaring-bulk-shipping-rates/ https://chitraguptatimes.com/2022/09/07/ae-shipping-on-a-roll-once-again-with-soaring-bulk-shipping-rates/#respond Wed, 07 Sep 2022 12:17:52 +0000 https://demo.blazethemes.com/local-news-pro-six/?p=37 మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బాసరగడి గ్రామంలో గోనె సంచిలో బాలిక మృతదేహం లభించింది. స్థానికుల వివరాల ప్రకారం.. అదిలాబాద్ జిల్లా చెందిన ప్రభాకర్ కుటుంబంతో కలిసి సూరారంలో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 12న కుమార్తె ఏం జోష్న(7) కనిపించడం లేదని సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, బాలిక మంగళవారం శవమై కనిపించింది. దీంతో చిన్నారి కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

]]>
https://chitraguptatimes.com/2022/09/07/ae-shipping-on-a-roll-once-again-with-soaring-bulk-shipping-rates/feed/ 0 37
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు https://chitraguptatimes.com/2022/09/07/what-is-womens-equality-day-and-why-is-it-celebrated/ https://chitraguptatimes.com/2022/09/07/what-is-womens-equality-day-and-why-is-it-celebrated/#respond Wed, 07 Sep 2022 12:08:21 +0000 https://demo.blazethemes.com/local-news-pro-six/?p=34 దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు అమ్మకాల బత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి.

సెన్సెక్స్ ఉదయం 82,101.86 పాయింట్ల (క్రితం ముగింపు 81,973.05) వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 82,300.44 వద్ద గరిష్ఠాన్ని తాకింది. తర్వాత నష్టాల్లోకి జారుకుంది. చివరికి 152.93 పాయింట్లతో 81,820.12 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 70.60 పాయింట్ల నష్టంతో 25,057.35 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.04గా ఉంది.

సెన్సెక్స్ 30 సూచీలో ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభపడగా.. బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, టాటా స్టీల్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో ముగిశాయి..

]]>
https://chitraguptatimes.com/2022/09/07/what-is-womens-equality-day-and-why-is-it-celebrated/feed/ 0 34
ఏపీలో మద్యం షాపుల కొత్త టైమింగ్స్ ఇవే..! https://chitraguptatimes.com/2022/09/07/global-chip-shortage-to-hurt-computer-firms-during-festive-season/ https://chitraguptatimes.com/2022/09/07/global-chip-shortage-to-hurt-computer-firms-during-festive-season/#respond Wed, 07 Sep 2022 12:00:54 +0000 https://demo.blazethemes.com/local-news-pro-six/?p=31 ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపు ప్రశాంతంగా మునిగిసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 14న లాటరీ డ్రా నిర్వహించి మద్యం షాపులను విజేతలకు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలు ఉండగా అందులో 10 శాతం అంటే 345 దుకాణాలను కేవలం మహిళలే దక్కించుకున్నారు. ఈ లాటరీ ప్రక్రియ ఆయా జిల్లాల్లోని కలెక్టర్ల పరిధిలో జరిగాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో అక్టోబర్ 16 నుంచి కొత్త మద్యం పాలసీ అమలులోకి వస్తుంది. కొత్త పాలసీలో భాగంగా మద్యం షాపులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 వరకూ తెరిచి ఉండనున్నాయి. తక్కువ ధరకే మద్యం విక్రయాలు జరుగుతాయని ప్రభుత్వం చెబుతోంది. గత ఐదేళ్లుగా అందుబాటులో లేని డిజిటల్ పేమెంట్స్ సైతం చేయవచ్చు. దాంతో నగదు చెల్లింపు సమస్యకు చెక్ పెట్టింది కూటమి ప్రభుత్వం. నిబంధనలు కచ్చితంగా పాటించాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని మద్యం షాపు నిర్వాహకులను హెచ్చరించారు..

]]>
https://chitraguptatimes.com/2022/09/07/global-chip-shortage-to-hurt-computer-firms-during-festive-season/feed/ 0 31